తనపై అసత్య ప్రచారం జరుగుతోందన్న అజయ్ దేవగణ్

Ajay Devgan team rubbishes.అజయ్ దేవగణ్ గురించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది, దానిలో నిజం లేదని అజయ్ టీం

By Medi Samrat  Published on  30 March 2021 1:11 PM GMT
Ajay Devgn

అజయ్ దేవగణ్.. బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడమే కాకుండా ఆర్.ఆర్.ఆర్. సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో అజయ్ దేవగణ్ గురించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో ఏముందంటే.. అజయ్ దేవగణ్ ను కొందరు కొట్టారు అని..! అది కూడా ఢిల్లీలో అట. ఢిల్లీలోని ఏరోసిటీ పబ్‌ బయట ఓ వ్యక్తితో కొందరు ఘర్షణకు దిగడమే కాక అతడిని చితకబాదారని వార్తలు వైరల్ అయ్యాయి. అందులోని బాధితుడు అజయ్‌ దేవ్‌గణ్‌ అని ప్రచారం చేస్తూ వచ్చారు.

ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని అజయ్ దేవగణ్ టీమ్ తెలిపింది. గతేడాది జనవరిలో జరిగిన తానాజీ: ద అన్‌సంగ్‌ వారియర్‌ ప్రమోషన్స్‌ తర్వాత ఇప్పటివరకు అజయ్‌ ఢిల్లీకి వెళ్లనేలేదని తేల్చి చెప్పారు. 'మైదాన్‌', 'గంగూబాయ్‌ కథియావాడి', 'మేడే' చిత్రాల షూటింగ్‌ కోసం కొన్ని నెలలుగా ముంబైలోనే అజయ్ దేవగణ్ ఉంటున్నారట.. ఢిల్లీకి వెళ్లి దాదాపు 14 నెలలవుతోందని క్లారిటీ ఇచ్చారు. ఇక అసత్య అసత్య ప్రచారాలు చేయకండని అజయ్‌ టీమ్‌ చెబుతోంది.

ఢిల్లీలోని పబ్‌ బయట రెండు వాహనాలు ఒకదానికొకటి తగలడంతో రెండు గ్రూపులు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి అజయ్ దేవగణ్ లా ఉండడంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయింది.

Next Story
Share it