ఆర్ఆర్ఆర్.. గర్జించిన అజయ్ దేవగన్

Ajay Devgn motion poster from RRR.అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్భంగా 'ఆర్ఆర్‌ఆర్' చిత్ర బృందం ఆయన లుక్ ని రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2021 7:11 AM GMT
Ajay Devgn poster in RRR

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్ఆర్( రౌధ్రం ర‌ణం రుధిరం)'. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. నేడు (ఏప్రిల్ 2) అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్భంగా 'ఆర్ఆర్‌ఆర్' చిత్ర బృందం ఆయన లుక్ ని రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పింది. 'ప్రజలను శక్తివంతం చేయడం అతని లక్షణం.. అతని బలం అతని భావోద్వేగంలో ఉంటుంది' అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో అజయ్ దేవగన్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపిస్తున్న ఆయన చుట్టూ శత్రువులు తుపాకులు ఎక్కుపెట్టి ఉండగా.. 'లోడ్..ఎయిమ్..షూట్' అంటూ అజయ్ గట్టిగా అరుస్తున్నారు. దీనికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌న్.. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌ల గురువుగా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అది కూడా ఫ్లాష్‌బాక్ సీన్ల‌లో క‌నిపించ‌నున్న‌ట్లు టాక్‌. అత‌డికి జంట‌గా శ్రియా శ‌ర‌ణ్ న‌టిస్తోంది. దాదాపు రూ.450 కోట్ల భారీ బ‌డ్డెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్1 బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇక విజయదశమి సంద‌ర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 13న ఈ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story