ఆస్ప‌త్రిలో చేరిన ధనుష్ మాజీ భార్య.. 'ఈ ఏడాది ఇంకా ఏమీ తీసుకువ‌స్తావో అంటూ..'

Aishwaryaa Rajinikanth Tests Positive for Covid-19.క‌రోనా మ‌హ‌మ్మారి చిత్ర ప‌రిశ్ర‌మ‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Feb 2022 5:13 AM GMT
ఆస్ప‌త్రిలో చేరిన ధనుష్ మాజీ భార్య.. ఈ ఏడాది ఇంకా ఏమీ తీసుకువ‌స్తావో అంటూ..

క‌రోనా మ‌హ‌మ్మారి చిత్ర ప‌రిశ్ర‌మ‌ను వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల చాలా మంది న‌టీన‌టులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. తాజాగా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమారై, న‌టుడు ధ‌నుష్ మాజీ భార్య‌, నిర్మాత ఐశ్వ‌ర్య కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. అన్ని జాగ్ర‌త్తలు తీసుకున్న‌ప్ప‌టికి త‌న‌కు క‌రోనా వ‌చ్చిన‌ట్లు తెలిపింది. ఇక ఈ ఏడాది త‌న‌కింకా ఏమేమీ ఇవ్వ‌బోతుందోన‌ని అంటూ భార‌మైన వ్యాఖ్య‌లు చేసింది.

'అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి. ఓ 2022.. నా కోసం ఇంకా ఏమేమి తీసుకొస్తావో చూస్తా'అంటూ ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ విష‌యం తెలిసిన ఆమె అభిమానులు.. ఐశ్వ‌ర్య త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రిత‌మే ఐశ్వ‌ర్య‌, ధ‌నుష్‌లు విడాకులు తీసుకున్నారు. త‌మ 18 సంవ‌త్స‌రాల వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికిన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇద్ద‌రూ వెల్ల‌డించారు. అయితే.. ఐశ్వర్య తన పేరులో నుంచి ఇంకా ధనుష్ పేరును తొలగించలేదు. దీంతో ఈ ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌ల‌వాల‌ని అంద‌రూ ఆకాంక్షిస్తున్నారు. కాగా.. ఇటీవ‌లే ధ‌నుష్‌కి సైతం క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it