మరోసారి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ కుమారై ఐశ్వర్య
Aishwaryaa Rajinikanth hospitalised after she complains of fever and vertigo.సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య
By తోట వంశీ కుమార్ Published on 7 March 2022 3:41 PM ISTసూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి ఆస్పత్రి పాలైంది. పోస్ట్ కొవిడ్ కారణంగా అనారోగ్యం బారిన పడడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి 1న ఐశ్వర్య కరోనా బారిన పడడంతో హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. కోలుకున్న తరువాత ఆమె డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం 'ముసాఫిర్' అనే మ్యూజిక్ వీడియో షూటింగ్ పనుల్లో బిజీగా ఉండిపోయారు.
తాజాగా ఆమె పోస్ట్ కోవిడ్ కారణంగా అనారోగ్యం బారిన పడింది. 'జీవితం.. కరోనాకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. జ్వరం, వర్టిగోతో మరోసారి ఆస్పత్రిలో చేరాను 'అంటూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'ఎంతో స్ఫూర్తి నీయమైన, గొప్ప మహిళా డాక్టర్ ప్రీతికా చారిని కలవడం, ఆమె తనకు సమయం వెచ్చించడం గర్వంగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవడం ద్వారా మహిళా దినోత్సవాన్ని ప్రారంభించడం గొప్పగా ఉంది. ఇది నాకు గర్వకారణం' ఆ పోస్టులో ఐశ్వర్య తెలిపింది.
ఈ విషయం తెలిసిన అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు.. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. సినీ పరిశ్రమలో స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ధనుష్-ఐశ్వర్యలు ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ వేరు వేరుగా ఉంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు.