కూతురికి బ‌ర్త్ డే విషెస్ చెప్పేది ఇలాగేనా..? ఐశ్వ‌ర్య రాయ్‌ను ట్రోల్ చేస్తున్న నెటీజ‌న్లు

Aishwarya Rai Bachchan's Birthday Post For Daughter Aaradhya Brings Out The Trolls.ఆరాధ్య బచ్చన్ పుట్టిన రోజు నేడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2022 12:49 PM IST
కూతురికి బ‌ర్త్ డే విషెస్ చెప్పేది ఇలాగేనా..? ఐశ్వ‌ర్య రాయ్‌ను ట్రోల్ చేస్తున్న నెటీజ‌న్లు

బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్య రాయ్, నటుడు అభిషేక్ బచ్చన్ ల గారాల ప‌ట్టి ఆరాధ్య బచ్చన్ పుట్టిన రోజు నేడు(న‌వంబ‌ర్ 16). ఈ సంద‌ర్భంగా త‌ల్లి ఐశ్వ‌ర్య త‌న కుమార్తె ఆరాధ్య‌తో క‌లిసిన దిగిన ఓ ఫోటోను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంటూ కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ఈ ఫోటోలో ఆమె త‌న కుమార్తె ఆరాధ్య పెదవులపై ముద్దు పెట్టుకుంది. ఇలా కుమార్తెకు ఎవ‌రైనా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతారా..? అంటూ ఐశ్వ‌ర్య రాయ్‌పై నెటీజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు.

ఐశ్వర్య పోస్ట్ ఏంటి..

అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఐశ్వర్య త‌న కుమారై ఆరాధ్య 11వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలో కుమార్తె ఆరాధ్య పెద‌వుల‌పై ఐశ్వ‌ర్య ముద్దు పెట్టుకుంది. ఆ ఫోటోకు నా ప్రేమ...నా జీవితం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ఆరాధ్య అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

ట్రోల్స్ మొద‌లు..

మాజీ మిస్‌ యూనివర్స్ షేర్ చేసిన ఫోటోపై వివాదం మొద‌లైంది. కొంద‌రు అభిమానులు ఈ చిత్రాన్ని చాలా క్యూట్ అని పిలుస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఇలా విషెష్ చెప్ప‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. ఇది మ‌న సంస్కృతి కాద‌ని, విదేశీ సంస్కృత‌ని మండిప‌డుతున్నారు. పబ్లిసిటీ కోసం ఇంత నీచంగా ఫొటోలు పెట్టాలా..? అంటూ ఇంకొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. 'నువ్వు ఇలా ప్రేమిస్తున్నావు, ఫర్వాలేదు, కానీ అలాంటి చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు' అని ఒక‌రు వ్రాశారు. తల్లీ, బిడ్డల సంబంధాన్ని జడ్జ్‌ చేయడం ఆపండి. అది కేవలం ముద్దు. ఆమె తన బిడ్డకు అమ్మ. ఈ ఫొటో బిడ్డపై తల్లికున్న స్వచ్ఛమైన ప్రేమ, మమకారాన్ని చూపుతోంది. ప్రతి విషయాన్ని వక్రదృష్టితో చూడడం మానండి అంటూ కొంద‌రు ఐశ్వ‌ర్య‌కు మ‌ద్ద‌తుగా కామెంట్లు పెడుతున్నారు.

ఐశ్వర్య, అభిషేక్‌లు ఏప్రిల్ 2007లో వివాహం చేసుకున్నారు. 16 నవంబర్ 2011న ఈ జంట‌కు ఆరాధ్య జ‌న్మించింది. కూతురు అంటే ఐశ్వ‌ర్య‌కు ఎంతో ప్రేమ‌. అమ్మ‌గా కంటే త‌న‌కో స్నేహితురాలిగా ఉండేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతాను అని ఓ సంద‌ర్భంలో ఐశ్వ‌ర్య చెప్పింది.

Next Story