బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు నాసిక్‌లోని సిన్నార్ రెవెన్యూ శాఖ నోటీసులు పంపింది. వ్యవసాయేతర పన్ను బకాయిల చెల్లింపుకు సంబంధించి నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ సహా 1200 మంది భూ యజమానులకు సిన్నార్ తహసీల్దార్ ఈ నోటీసు జారీ చేశారు. వాస్తవానికి.. సిన్నార్‌కు చెందిన అద్వాది ప్రాంతంలో ఐశ్వర్య రాయ్ విండ్‌మిల్ ఏర్పాటు కోసం భూమిని కొనుగోలు చేసింది. ఆమెకు భూమికి సంబంధించి ప్రతి ఏటా రూ.22 వేలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే సంవత్సరం నుంచి పన్ను ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మార్చి నెలాఖరులోగా బకాయి పన్ను చెల్లించాలని నోటీసులో నటిని రెవెన్యూశాఖ ఆదేశించింది.
22 వేల రూపాయలు బకాయి పన్ను
ఐశ్వర్యరాయ్‌కి అద్వాడిలోని కొండ ప్రాంతాల్లో దాదాపు 1 హెక్టారు భూమి ఉందని చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించి ఏడాది పన్ను రూ.22వేలు బకాయి ఉండడంతో ఐశ్వర్యకు నోటీసులు అందాయి. సిన్నార్ రెవెన్యూశాఖ.. భూ యజమానుల నుండి సంవత్సరానికి 1.11 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. అందులో 65 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా రికవరీ లక్ష్యంగా రెవెన్యూ శాఖ ఈ చర్య తీసుకుంది.
ఇక ఐశ్వర్య సినిమాల గురించి మాట్లాడుకుంటే.. ఆమె భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్ 1' గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రెండవ భాగం 28 ఏప్రిల్ 2023న విడుదల కానుంది. ఇందులో కూడా ఐశ్వర్య కీలక పాత్ర పోషించనుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యతో పాటు విక్రమ్, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.