ఆస్పత్రిలో నటుడు.. విషం ఇచ్చారని ఆరోపణ
రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి
ఆస్పత్రిలో నటుడు.. విషం ఇచ్చారని ఆరోపణ
రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఎవరో జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చారని అన్నారు. గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతుండగా.. కొందరు పండ్ల రసం ఇచ్చారని, అది తాగిన కొద్దిసేపటికే గుండెనొప్పి మొదలైందని అన్నారు. ప్రస్తుతం ఆయన చెన్నై లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మన్సూర్ అలీఖాన్ తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల గుర్తు జాక్‌ఫ్రూట్. ఈ క్రమంలోనే ఆయన గత కొద్ది రోజులుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. బుధవారం మ్యానిఫెస్టో సమయంలో ఖాన్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు నివేదికలు చెబుతున్నాయి. మన్సూర్ అలీ ఖాన్ ఇటీవలే రాజకీయ పార్టీ 'తమిళ దేశియ పులిగల్' నుండి తొలగించబడ్డాడు.
అస్వస్థతకు గురైన రోజున ఆయన గుడియాతం ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. బుధవారం గుడియాతంలో ప్రచారం సందర్భంగా తనకు విషప్రయోగం జరిగిందని నటుడు ఆరోపించడం వివాదానికి ఆజ్యం పోసింది. మన్సూర్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలతో మన్సూర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.