అహింస ట్రైల‌ర్.. అద‌రగొట్టిన ద‌గ్గుబాటి అభిరామ్‌

Ahimsa Movie Trailer out.దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న మూడో త‌రం న‌టుడు ద‌గ్గుబాటి అభిరామ్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2023 8:13 AM GMT
అహింస ట్రైల‌ర్.. అద‌రగొట్టిన ద‌గ్గుబాటి అభిరామ్‌

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న మూడో త‌రం న‌టుడు ద‌గ్గుబాటి అభిరామ్‌. సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అయిన అభిరామ్ కి ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపే ఉంది. తాజాగా ఈయ‌న "అసింహ‌" అనే చిత్రంతో హీరోగా పరిచ‌యం అవుతున్నాడు. ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో గీతికా తివారీ క‌థానాయిక‌. సముద్రఖని, స‌దా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్నారు.

గురువారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మెగా ప‌వ‌ర్ రామ్ చర‌ణ్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను చూస్తే వ్య‌వ‌సాయం చేసుకునే ఓ రైతు కొడుకు, ఓ భూ స్వామికి మ‌ధ్య జ‌రిగే పోరాటమే ఈ చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. గాంధీ, బుద్ధుడు కాదు.. కృష్ణుడే క‌రెక్ట‌ర్ ధ‌ర్మ‌పోరాటం చేస్తా అని అభిరామ్ చెప్పిన డైలాగ్ అల‌రిస్తోంది. మొత్తంగా ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. మ‌రీ థియేట‌ర్ల‌లో ఈ ద‌గ్గుబాటి హీరో ప్రేక్ష‌కుల‌ను ఎలా అల‌రిస్తాడో చూడాలి మ‌రి.

Next Story