'లైగ‌ర్' నుంచి రొమాంటిక్ సాంగ్ వ‌చ్చేసింది

Afat Song from Liger out now.రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌క‌కొండ న‌టించిన తాజా చిత్రం లైగ‌ర్. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2022 10:42 AM IST
లైగ‌ర్ నుంచి రొమాంటిక్ సాంగ్ వ‌చ్చేసింది

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌క‌కొండ న‌టించిన తాజా చిత్రం 'లైగ‌ర్'. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న అన‌న్య పాండే న‌టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్టు 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు ఈ చిత్రం నుంచి రొమాంటిక్ పాట‌ను విడుద‌ల చేశారు.

'ఆఫ‌త్ 'అంటూ ఈ పాట సాగుతోంది. 'బాబోయ్ మామూలు డ్రామాలు కావు. అన్నీ లెక్క‌లేసుకుని నువ్వు బ‌క‌రా అని ఫిక్స్ అయిన‌క నంబ‌ర్ ఇస్త‌య్‌. ఇక వాట్స‌ప్‌లు షురూ ఐతే చూడు నిద్ర‌పోనివ‌వ్వు..ప‌నులు చేసుకోనివ‌వ్వు.. బ‌తుకుంతా వాళ్ల‌కు రాసిచ్చిన‌ట్లే' అంటూ ర‌మ్య‌కృష్ణ చెప్పే డైలాగ్‌తో ఈ పాట మొద‌లైంది. విజ‌య్‌, అనన్య‌ల డ్యాన్స్ ఆక‌ట్టుకుంటోంది. భాస్క‌రభ‌ట్ల ర‌చించిన ఈ పాట‌ను సింహా, శ్రావ‌ణ భార్గవి ఆలపించారు.

బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ముంబ‌యి మురికివాడ‌కు చెందిన చాయ్‌వాలాగా క‌నిపించ‌నున్నాడు విజ‌య్‌. ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌కపాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని క‌ర‌ణ్‌జోహ‌ర్‌, ఛార్మీతో క‌లిసి పూరి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు.

Next Story