మేజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Adivi Sesh's Major to release on May 27.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ సారి సంక్రాంతి క‌ళ త‌ప్పంది. సంక్రాంతికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2022 8:02 AM GMT
మేజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ సారి సంక్రాంతి క‌ళ త‌ప్పంది. సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన పెద్ద చిత్రాలు అన్ని వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడిప్పుడే క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో ఇప్పుడు చిత్రాలు అన్ని వరుస పెట్టి విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చిత్రాలు త‌మ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌గా.. తాజాగా అడివి శేష్ హీరోగా రూపొందుతున్న మేజ‌ర్ చిత్రం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

26/11 ఎటాక్‌లో భారత దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. గూఢచారి' ఫేమ్‌ శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎంబి ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్, A + S మూవీస్ సంస్థలు క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తుండ‌గా.. అడివి శేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ న‌టిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని మార్చి 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

Next Story
Share it