హిట్ 2 టీజ‌ర్‌.. 'నేను విన్నది కరెక్టే .. నీకు కొంచెం నోటిదూల ఎక్కువ'

Adivi Sesh HIT-2 Teaser Released.అడివి శేష్‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం హిట్‌-2.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2022 12:38 PM IST
హిట్ 2 టీజ‌ర్‌.. నేను విన్నది కరెక్టే .. నీకు కొంచెం నోటిదూల ఎక్కువ

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ త‌న కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్‌. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'హిట్‌-2'. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుదల చేశారు.

పోలీస్ ఆఫీస‌ర్‌గా అడివి శేష్ న‌ట‌న ఆక‌ట్టుకుంటోంది. స‌స్పెన్స్‌, క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. అనుమానాస్ప‌ద స్థితిలో ఓ అమ్మాయి హ‌త్య‌కు గురి అవుతుంది. ఆ అమ్మాయి ఎవ‌రు..? ఆమెను అతి దారుణంగా హ‌త్య చేసింది ఎవ‌రు..? అన్న అంశాల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. జాన్ స్టీవర్ట్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

గతంలో విష్వక్‌సేన్ హీరోగా 'హిట్' సినిమాను నిర్మించిన నాని, ఆ సిరీస్ లో భాగంగా 'హిట్ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. మీనాక్షి చౌదరి క‌థానాయిక కాగా.. రావు రమేశ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

Next Story