ఆక‌ట్టుకుంటున్న 'అదిరిందే' వీడియో సాంగ్

Adirindey song From Macherla Niyojakavargam movie released.హిట్లు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో టాలీవుడ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2022 12:21 PM IST
ఆక‌ట్టుకుంటున్న అదిరిందే వీడియో సాంగ్

హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో టాలీవుడ్‌ హీరో నితిన్‌ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ప్రస్తుతం నితిన్ న‌టిస్తున్న చిత్రం 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆగ‌స్టు 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. వ‌రుస‌గా అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తోంది.

తాజాగా ఈ చిత్రంలోని థ‌ర్డ్ సింగిల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. 'అదిరిందే' అంటూ ఈ మెలోడీ సాంగ్ సాగుతోంది. ఈ పాట‌లో నితిన్‌, కృతిశెట్టి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. స్టెప్పులు అల‌రిస్తున్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన 'రా రా రెడ్డి' సాంగ్‌ యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా ఆదిత్య మూవీస్ అండ్‌ ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స‌ర్వ‌సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు.

Next Story