'ఆదిపురుష్' వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. నష్టం ఎంతో తెలుసా?

ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌తో ఓపెనింగ్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి.

By అంజి  Published on  24 July 2023 8:27 AM IST
Adipurush, box office collections, Prabhas

'ఆదిపురుష్' వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. నష్టం ఎంతో తెలుసా?

ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌తో ఓపెనింగ్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి. అయితే ఈ సినిమా మెల్లి మెల్లిగా డ్రాప్ అవుతూ.. క్లోసింగ్ కలెక్షన్స్‌తో బయ్యర్స్‌ని కళ్లు తిరిగి పడిపోయేలా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చాయి. నిర్మాతలు కూడా నార్త్ ఇండియా, ఓవర్సీస్‌లో తమ సొంతంగా విడుదల చేయడంతో చిన్న నష్టాలను చవిచూశారు. నార్త్‌లో, ఓవర్సీస్‌లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా సౌత్ ఇండియా హక్కులను రూ.175 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే రికవరీ చేసుకుంది మాత్రం సుమారు 100 కోట్లే.

ప్రధాన కొనుగోలుదారు, వ్యక్తిగత కొనుగోలుదారులు ఇద్దరికీ కలిపి దక్షిణ భారత మార్కెట్ల నుండి రూ.75 కోట్ల నష్టం వచ్చింది. మొత్తం థియేట్రికల్‌ల విలువ రూ.270 కోట్లు కాగా, ఈ చిత్రం రూ.185 కోట్ల షేర్ వసూలు చేయడంతో సినిమాకు మొత్తంగా రూ.85 కోట్ల నష్టాలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 360 కోట్లు వసూలు చేసింది. బాహుబలి2, బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్‌కు అత్యధిక వసూళ్లు రాబట్టిన 4వ చిత్రం ఇది. కాగా ఈ సినిమాని రామాయణాన్ని వక్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కించారని, గ్రాఫిక్స్ కూడా కార్టూన్ బొమ్మలను చూసినట్టుగానే అనిపించిందని, అందుకే ఈ సినిమాకు మిక్స్‌డ్‌ రెస్పాన్స్ వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం.

'ఆదిపురుష్' క్లోజింగ్‌ కలెక్షన్స్‌

నిజాం: రూ. 39.10 కోట్లు

సీడెడ్: రూ. 10.20 కోట్లు

యూఏ: రూ.10.62 కోట్లు

గుంటూరు: రూ. 5.55 కోట్లు

ఈస్ట్‌ గోదావరి: రూ.6.13 కోట్లు

కృష్ణా: రూ.4.84 కోట్లు

వెస్ట్‌ గోదావరి: రూ.5 కోట్లు

నెల్లూరు: రూ.2.73 కోట్లు

కర్ణాటక: రూ.11.35 కోట్లు - రూ.22.6 కోట్ల గ్రాస్‌

తమిళనాడు: రూ.2.65 కోట్లు - రూ.6.5 కోట్ల గ్రాస్‌

కేరళ: రూ.0.9 కోట్లు - రూ.2.2 కోట్ల గ్రాస్‌

నార్త్‌ ఇండియా: రూ.63.60 కోట్లు - రూ.22.6 కోట్ల గ్రాస్‌

ఓవర్సీస్‌: రూ.184.87 కోట్లు - రూ.359.3 కోట్ల గ్రాస్‌

వరల్డ్‌వైడ్‌గా: రూ.105.2 కోట్లు

కాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు భారీ నష్టాలు చూసిన లిస్ట్‌లో ఆచార్య రూ.86 కోట్లు, ఆదిపురుష్‌ రూ.85 కోట్లు, అజ్ఞాతవాసి రూ.70 కోట్లు, స్పైడర్‌ రూ.60 కోట్లు, ఎన్టీఆర్‌ కథానాయకుడు రూ.50 కోట్లు సినిమాలు ఉన్నాయి.

Next Story