"ఆదిపురుష్" టీజర్ వ‌చ్చేసింది.. దిమ్మ‌తిరిగిపోయే విజువ‌ల్స్ అంతే..

Adipurush Teaser Launch. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం “ఆదిపురుష్”.

By Medi Samrat  Published on  2 Oct 2022 7:27 PM IST
ఆదిపురుష్ టీజర్ వ‌చ్చేసింది.. దిమ్మ‌తిరిగిపోయే విజువ‌ల్స్ అంతే..

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం "ఆదిపురుష్". ఈ సినిమా టీజర్ కోసం దేశ‌వ్యాప్తంగా ఉన్న సినిమా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. రామాయణం ఆధారంగా అత్యున్నత సాంకేతికతతో రూపొందిన చిత్రమిది. అందుకే.. చిత్ర‌బృందం ఈ రోజు అయోధ్య వేదిక‌గా టీజ‌ర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఈ క్ర‌మంలోనే కొద్దిసేప‌టిక్రితం టీజర్ లాంచ్ అన్ని పాన్ ఇండియా భాషల్లో జ‌రిగింది.


ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా.. కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ రావణుడిగా అల‌రించ‌నున్నాడు. ఆదిపురుష్ తో అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ గుర్తింపు దక్కించుకుంటాడనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్‌ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో 20,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.




Next Story