ఆదిపురుష్ ట్రైల‌ర్ రిలీజ్‌.. వీఎఫ్ఎక్స్ బాగున్నాయంటున్నారు..!

Adipurush Official Trailer Released. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో

By Medi Samrat  Published on  9 May 2023 4:46 PM IST
ఆదిపురుష్ ట్రైల‌ర్ రిలీజ్‌.. వీఎఫ్ఎక్స్ బాగున్నాయంటున్నారు..!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ టీజర్ లోని గ్రాఫిక్స్ కంటే ఇప్పటి VFX వర్క్ బాగుందని అంటున్నారు. ఈ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు టీసిరీస్, రెట్రోఫైల్స్ ఈ చిత్రాన్ని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగులో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.


ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది నా రాముడి కథ అంటూ వాయిస్`ఓవర్‌తో మొదలుపెట్టారు. రాముడు సీతను చేరుకోడానికి వానరులతో కలిసి చేసిన ప్రయత్నాన్ని విజువల్ వండర్ గా ఈ సినిమాలో చూపించనున్నారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, సాంగ్స్ విషయంలో చిత్ర యూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లే కనిపిస్తోంది. మొబైల్, టీవీలలో కంటే థియేటర్లలో సినిమాను చూస్తే మంచి ఫీల్ వస్తుందంటూ చెబుతున్నారు.


Next Story