ప్ర‌భాస్ అభిమానుల‌కు శుభ‌వార్త‌

Adipurush Movie Teaser Release Date Is Officially Confirmed.సినీ అభిమానులు ఎదురుచూస్తున్నచిత్రాల్లో ఆదిపురుష్ చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sep 2022 9:07 AM GMT
ప్ర‌భాస్ అభిమానుల‌కు శుభ‌వార్త‌

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నచిత్రాల్లో 'ఆదిపురుష్' చిత్రం ఒక‌టి. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. రామాయ‌ణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూరైనా కానీ ఒక్క అప్‌డేట్‌ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌లు ఎప్పుడెప్పుడూ వ‌స్తాయంటూ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎట్ట‌కేల‌కు చిత్ర బృందం టీజ‌ర్‌, ఫ‌స్ట్‌లుక్‌పై క్లారిటీ ఇచ్చింది. అయోధ్య‌లో అక్టోబ‌ర్ 2న స‌ర‌యు న‌ది ఒడ్డున టీజ‌ర్‌, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ట్వీట్ చేశాడు."మా మ్యాజిక‌ల్ ప్ర‌యాణాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు మీరు అనుభూతి చెందండి.. ప్రేమించండి" అని రాసుకొచ్చారు.

ప్ర‌భాస్ రాఘ‌వ‌గా, సైఫ్ అలీఖాన్ లంకేశ్‌, హీరోయిన్ కృతిస‌న‌న్ జాన‌కిగా, స‌న్నీ సింగ్ ల‌క్ష్మ‌ణ‌గా క‌నిపించ‌నున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా దాదాపు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story