'ఆదిపురుష్' రన్ టైమ్ ఎంతంటే?

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించారు.

By M.S.R  Published on  8 Jun 2023 9:00 PM IST
Adipurush Movie,  Adipurush Run Time, Prabhas, Bollywood

'ఆదిపురుష్' రన్ టైమ్ ఎంతంటే? 

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించారు. తాజాగా ఈ మూవీ ఫైనల్ రన్ టైంని లాక్ చేసుకుంది. అలాగే సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్ U సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా పూర్తి నిడివి వచ్చి 2 గంటల 59 నిముషాలు. దాదాపు 3 గంటల నిడివితో ఆదిపురుష్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తొలుత ఈ సినిమాను 174 నిమిషాల నిడివితో రిలీజ్ చేయాల‌ని భావించారు. తాజాగా మ‌రో ఐదు నిమిషాల నిడివితో కూడిన ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను యాడ్ చేసిన‌ట్లు చెబుతున్నారు. మూడు గంట‌ల‌కు ఒక నిమిషం త‌క్కువ నిడివితో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత హ‌య్యెస్ట్ ర‌న్‌టైమ్‌తో రిలీజ్ కానున్న మూవీగా ఆదిపురుష్ నిలుస్తుంది. ఆదిపురుష్ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా జూన్ 16న రిలీజ్ కానుంది. తెలుగు, హిందీతో పాటు పలు భార‌తీయ భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు.

మరో వైపు ఆదిపురుష్ సినిమాను ఫ్రీగా చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు పదివేల ప్లస్ టికెట్లను ఉచితంగా ఇస్తామని ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. గూగుల్ ఫామ్ నింపితే టికెట్లు నేరుగా మేము పంపిస్తామని అభిషేక్ అగర్వాల్ వెల్లడించారు. శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం, ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన అడుగుజాడలను అనుసనరించాలి... జై శ్రీరామ్ కీర్తనలు నలువైపులా ప్రతిధ్వనించాలని ఆయన ట్వీట్ చేశారు.

Next Story