అఫిషియల్.. 'ఆదిపురుష్' రిలీజ్ డేట్ ఫిక్స్‌

Adipurush movie releasing on 11th august 2022.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు చేస్తూ పుల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sep 2021 7:56 AM GMT
అఫిషియల్.. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు చేస్తూ పుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో ఆదిపురుష్ చిత్రం ఒక‌టి. భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ప్ర‌భాస్.. రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం ఓ అప్‌డేట్‌ను అభిమానుల‌తో పంచుకుంది.

ఈ చిత్రాన్ని 2022 ఆగష్టు 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. ముంబైలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. సాధ్య‌మైనంత తొంద‌ర‌గా షూటింగ్‌ను పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు బావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9 వరకు 26 రోజులు సాగే లాంగ్ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తెరకెక్కించ‌నున్నారు. 3డిలో తెర‌కెక్కుతోన్న చిత్రం కావ‌డంతో గ్రాఫిక్స్ కోసం ఎక్కువ స‌మ‌యం కావాల్సి ఉంటుంది. అందుక‌నే వ‌చ్చే ఏడాది ఆగ‌స్టులో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది.

Next Story
Share it