సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఆదిపురుష్‌ !  

'Adipurush' movie dropped out of Sankranti festival race. నేషనల్ స్టార్ ప్రభాస్  శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే,  ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది.

By Sumanth Varma k  Published on  2 Nov 2022 1:39 PM IST
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఆదిపురుష్‌ !  

నేషనల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా "ఆదిపురుష్'' సినిమా రాబోతుంది. దీనికితోడు, బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఐతే, ఇప్పటికే ఈ సినిమా జనవరి 12న వచ్చే సంక్రాంతికి టార్గెట్ చేస్తూ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఆదిపురుష్‌కు చెందిన AP డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చిన అధికారిక అప్ డేట్ ప్రకారం.. VFX కారణంగా ఆదిపురుష్‌ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి కృతిసనన్ జోడీగా నటిస్తోంది.

అన్నట్టు ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే స‌మ‌యంలో 15 దేశీయ‌, అంత‌ర్జాతీయ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీని మోషన్ కాప్చర్ విధానంలో షూట్ చేస్తున్నారు. అంటే.. నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారు. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా ఉంటుంది. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే

Next Story