ఆదిపురుష్ ఫ‌స్ట్‌లుక్‌.. రాముడిగా ప్ర‌భాస్.. అదుర్స్

Adipurush first look Prabhas transforms into Lord Ram.ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒక‌టి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sept 2022 8:22 AM IST
ఆదిపురుష్ ఫ‌స్ట్‌లుక్‌.. రాముడిగా ప్ర‌భాస్.. అదుర్స్

సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒక‌టి. ప్ర‌భాస్ హీరోగా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌భాస్ అభిమానుల‌కు ద‌ర్శ‌కుడు ఓంరౌత్ స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆదిపురుష్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ పొడ‌వాటి జుట్టు, చేతికి రుద్రాక్ష‌లు ధ‌రించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి ప‌వ‌ర్‌పుల్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

"మా అద్భుత‌మైన ప్ర‌యాణంలో మీరు భాగం కండి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం. అయోధ్య‌లోని స‌ర‌యు న‌ది ఒడ్డున జ‌ర‌గ‌నున్న ఆదిపురుష్ టీజ‌ర్ లాంఛ్‌లో పాల్గొనండి. అక్టోబ‌ర్ 2న రాత్రి 7.11 గంట‌ల‌కు టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం" అని ఓం రౌత్ రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

రామాయ‌ణం ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకుంది ఈ చిత్రం. ప్ర‌భాస్ రాఘ‌వ‌గా, సైఫ్ అలీఖాన్ లంకేశ్‌, హీరోయిన్ కృతిస‌న‌న్ జాన‌కిగా, స‌న్నీ సింగ్ ల‌క్ష్మ‌ణ‌గా క‌నిపించ‌నున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా దాదాపు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story