అర్ధరాత్రి సమయంలో హీరోయిన్ సంజనకు అశ్లీల సందేశాలు
Adam Bidapa arrested for sending abusive messages to actress.నటి సంజనా గల్రానికి అశ్లీల సందేశాలు పంపిస్తున్న ఫ్యాషన్
By తోట వంశీ కుమార్
నటి సంజనా గల్రానికి అశ్లీల సందేశాలు పంపిస్తున్న ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఆడం బిడ్డప్ప(28)ను బెంగళూరు ఇందిరానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కన్నడకి చెందిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఆడం బిడ్డప్ప, సంజన మొదటి నుంచి కలిసి పని చేశారు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం ఉండేది. అయితే.. కొద్ది నెలల క్రితం కొన్ని కారణాల కారణంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరు కాంటాక్ట్‌లో లేరు.
అయితే.. ఇటీవల అర్ధరాత్రి సమయంలో వరుసగా అశ్లీల సందేశాలు, చిత్రాలు, వీడియోలు ఆడం పంపించినట్లు సంజన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 25 నుంచి వస్తున్న సందేశాలపై తాను అభ్యంతరం చెప్పినట్లు కూడా సంజన పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆడం బిడ్డప్పను అరెస్ట్ చేశారు. విచారించగా.. తాను ఎలాంటి మెసేజ్‌లు పంపలేదని అతడు చెప్పాడు. అతడి ఫోన్ పరిశీలించగా.. చాటింగ్ చేసినట్లు ఆధారాలు లభించలేదు. డిలీట్ చేసిన మెసేజ్‌ల కోసం పోలీసులు ఆ ఫోన్ ని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. కాగా.. ఫ్యాషన్ గురుగా ఖ్యాతి గడించిన ప్రసాద్ బిడ్డప్ప కుమారుడే ఆడం బిడ్డప్ప.
ప్రభాస్ నటించిన 'బుజ్జిగాడు' చిత్రంలో సంజన సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఈసినిమా తరువాత తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏమీ రాలేదు. అయితే.. కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రెండేళ్ల కిందట డ్రగ్స్ కేసులో అరెస్టై బయటికి వచ్చింది.