ద‌ర్శ‌కుడిని పెళ్లాడిన యామీగౌత‌మ్‌

Actress Yami Gautam ties Aditya Dhar.బాలీవుడ్ న‌టి యామీ గౌత‌మ్ పెళ్లి పీట‌లెక్కింది. ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2021 3:25 PM GMT
ద‌ర్శ‌కుడిని పెళ్లాడిన యామీగౌత‌మ్‌

బాలీవుడ్ న‌టి యామీ గౌత‌మ్ పెళ్లి పీట‌లెక్కింది. ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్‌తో మూడు ముళ్లు వేయించుకుని ఏడడుగులు న‌డిచింది. క‌రోనా నేప‌థ్యంలో అతి త‌క్కువ మంది బంధువుల స‌మ‌క్షంలో శుక్ర‌వారం వీరి పెళ్లి జ‌రిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది.

'మా కుటుంబం దీవెన‌ల‌తో వెడ్డింగ్ సెర్మ‌నీతో మేమిద్ద‌రం ఒక్క‌టయ్యాం. ల‌వ్‌, ఫ్రెండ్‌షిప్ కు కొన‌సాగింపుగా ఈ ప్రయాణాన్ని మొద‌లుపెట్టాం. యామీ-ఆదిత్య‌కు మీ దీవెన‌లు, ఆశీస్సులు కావాలి..'అంటూ సోష‌ల్ మీడియా ద్వారా కోరింది యామీగౌత‌మ్‌. భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేసింది. ఇందులో యామీ సంప్ర‌దాయ వ‌స్త్రాల్లో క‌నిపించి చిరున‌వ్వులు చిందించారు. పెళ్లి విష‌యం తెలుసుకున్న అభిమానులు, న‌టీన‌టులు నూత‌న దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

పెళ్లికొడుకు ఆదిత్య మరెవరో కాదు, 'ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్' ద‌ర్శ‌కుడు. ప్రస్తుతం ఇతడు విక్కీ కౌశల్‌ హీరోగా 'ద ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ' సినిమా తీస్తున్నాడు. 'ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్ చిత్ర కోసం ఆదిత్య‌-యామీ క‌లిసి ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య మొద‌లైన స్నేహం ప్రేమ‌గా మారింది.

Next Story
Share it