కరోనా బారిన నటి వరలక్ష్మి శరత్‌కుమార్.. స్పందించిన రాధిక
Actress Varalaxmi Sarathkumar tests covid 19 positive.కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా దేశ
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పలువురు సినీ నటులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని ఆదివారం ఉదయం ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.'
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అయినా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇటీవల నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోండి. సినిమా యూనిట్‌లో నటీ నటులు మాస్క్‌లు ధరించలేరు. కాబట్టి మిగిలిన యూనిట్ సభ్యులు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలి. కొవిడ్ ఇంకా మనల్ని వదిలి పోలేదు.' అంటూ వరలక్ష్మి ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.Take care Varu ❤️❤️❤️more strength to you. https://t.co/RRrZpg7XBV
— Radikaa Sarathkumar (@realradikaa) July 17, 2022
వరలక్ష్మి ట్వీట్‌కు రాధికా శరత్‌కుమార్ స్పందించారు. 'వరు జాగ్రత్తగా ఉండు. నీకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ మెసేజ్‌తో పాటు లవ్ ఎమోజీలను షేర్ చేశారు. వరలక్ష్మి పోస్టుపై నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. 'గెట్ వెల్ సూన్ వరలక్ష్మి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
శరత్‌కుమార్ వారసురాలిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన 'క్రాక్' చిత్రంలో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె తెలుగులో సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న 'యశోద' చిత్రంతో పాటు హనుమాన్', 'బాలయ్య 107' చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.