బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5.. అర్ధపావు భాగ్యం ఎలిమినేట్..?

Actress Uma Devi Eliminated From Bigg Boss Telugu 5.బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5లో తొలి వారం స‌ర‌యు ఎలిమినేట్ కాగా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sep 2021 5:51 AM GMT
బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5.. అర్ధపావు భాగ్యం ఎలిమినేట్..?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5లో తొలి వారం స‌ర‌యు ఎలిమినేట్ కాగా.. రెండో వారం ఎలిమినేష‌న్‌లో కాజల్‌, లోబో, ప్రియాంక సింగ్‌, ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, ప్రియ నామినేషన్‌లో ఉన్నారు. శ‌నివారం ఎపిసోడ్‌లో లోబో, అనీ మాస్ట‌ర్, ప్రియాంక సింగ్‌ల‌ని నాగార్జున సేవ్ చేశారు. ఇక మిగిలిన వారిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. కాగా.. వీరిలో ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్ డేజంర్ జోన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

వీరిద్ద‌రికి చాలా త‌క్కువ ఓట్లు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలోని స‌మాచారం ప్ర‌కారం కార్తీక‌దీప్ ఫేమ్ అర్ధపావు భాగ్యం అలియాస్‌ ఉమాదేవి ఎలిమినేట్ అయ్యార‌ని అంటున్నారు. దీంతో ఆమె అభిమానులు షాక్‌కు గుర‌వుతున్నారు. తొలివారంలో అంద‌రి మీద అరిచేస్తూ నానా ర‌చ్చ చేసిన ఉమాదేవీ.. రెండో వారంలో లోబోతో క‌లిసి త‌న‌లోని కామెడీ యాంగిల్‌ను ప‌రిచ‌యం చేసింది. వీరిద్ద‌రి ప్రేమ ముచ్చట్లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతున్నాయి. అయితే.. నామినేష‌న్‌లో ఉమాదేవి బూతులు మాట్లాడింది. ఇదే ఆమెకు నెగిటివిటీని తెచ్చి పెట్టింద‌ని అంటున్నారు. మ‌రి నిజంగానే ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారో లేదో నేడు ప్ర‌సారంకానున్న ఎపిసోడ్‌తో తెలిసిపోనుంది.

Next Story