బుల్లితెర నటి అయినప్పటికీ జబర్థస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది షబీనా షేక్. కాగా.. అభిమానులకు ఆమె షాక్ ఇచ్చింది. త్వరలోనే తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు చెప్పేసింది. తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
జూలై 17న ఎప్పటికీ మరిచిపోలేనంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమెకు జూలై 17న నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ.. కాబోయే భర్తను ట్యాగ్ చేసింది. ఆమెకు కాబోయే భర్త పేరు మున్నా అని తెలుస్తోండగా.. ఇంత కన్నా అతడి వివరాలు ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జంటకు పలువురు బెస్ట్ విషెష్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
'కస్తూరి', 'గృహలక్ష్మీ', 'నా పేరు మీనాక్షి 'వంటి సీరియల్స్‌లో నటించింది షబీనా. ఆ తరువాత జబర్థస్త్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. గత కొంత కాలంగా ఆమె సీరియల్స్‌లో కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి టీవీ షోల్లో కనిపిస్తోంది. దీంతో వివాహం అయిన తరువాత ఆమె నటిస్తుందా..? లేదో అన్న సందేహాలు మొదలయ్యాయి.