త‌ల్లి కాబోతున్న హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ

Actress Richa announces her pregnancy.లీడర్ చిత్రంతో టాలీవుడ్ ప‌రిచ‌య‌మైంది రిచా గంగోపాధ్యాయ్‌. త‌ల్లి కాబోతున్న రిచా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2021 4:28 PM IST
Actress Richa announces her pregnancy

'లీడర్' చిత్రంతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైంది రిచా గంగోపాధ్యాయ్‌. ఆ త‌రువాత 'నాగ‌వ‌ల్లి', 'మిర‌ప‌కాయ్', 'సారొచ్చారు', 'మిర్చి' వంటి సినిమాల్లో న‌టించి అల‌రించింది. అందంతో పాటు అభిన‌యంతోనూ ఆక‌ట్టుకోవ‌డంతో రిచాకు త‌మిళ‌, బెంగాలీ నుంచి కూడా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కెరీర్ పుల్ స్పీడ్‌లో దూసుకెలుతున్న త‌రుణంలో 2013లో సినిమాకు గుడ్ బై చెప్పి అమెరికాలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించడానికి వెళ్లింది. 2019 డిసెంబర్‌లో అమెరికాలోని తన చిన్ననాటి స్నేహితుడు జో లాంగేల్లాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.


తాజాగా రిచా గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. తాను త‌ల్లి కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఎంతో కాలం నుంచి ఓ విష‌యాన్ని మేము ర‌హ‌స్యంగా దాచి ఉంచాం. ఈ రోజు మీ అంద‌రికీ ఆ విష‌యాన్ని తెలియ‌జేయ‌డం మాకెంతో ఆనందంగా ఉంది. 'జూన్ నెల‌లో మా కుటుంబంలోకి ఓ చిన్నారి రానుంది. మేము ప్ర‌స్తుతం మాట‌ల్లో చెప్ప‌లేనంత సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాం. మా చిన్నారి కోసం ఎంతో ఆత్రుత‌తో ఎదురుచూస్తున్నామ‌ని' రిచా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.


Next Story