షాక్.. రేణు దేశాయ్‌కి ఏమైంది..? అనారోగ్య సమస్యతో బాధపడుతోందా..?
Actress Renu Desai opens up about her health struggles.నటి రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ విషయాన్ని
By తోట వంశీ కుమార్
గత కొంతకాలంగా సినీ ప్రముఖులు రక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. కొంత మంది క్యాన్సర్‌కు గురికాగా.. మరికొంత మంది మానసిక సమస్యలతో బాధపడుతూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. హీరోయిన్ సమంత మయోసైటిస్ బారిన చికిత్స పొందుతుండగా, మమతా మోహన్ దాస్, హంసా నందిని, సొనాలి బింద్రేలు క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ప్రముఖ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. గత కొంతకాలంగా తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తన పరిస్థితి ఏమీ బాగాలేదని తెలిపింది.
‘ నేను గత కొన్నాళ్లుగా గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కోవడానికి శక్తిని కూడగట్టుకుంటున్నాను. నన్ను దగ్గర్నుంచి చూస్తున్న వాళ్లకు ఈ విషయం తెలుసు. నాలాగే ఎవరైన బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ పోస్ట్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా ధైర్యం, ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఓ రోజు మనకు ఫలితం వస్తుంది. మన జీవితం మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకు ఎన్నో సర్‌ప్రైజులు ప్లాన్ చేసి ఉంచింది. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా సరే వాటిని నవ్వుతూ ఎదుర్కోవాలి.
ప్రస్తుతం నాకు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నారు. యోగా చేస్తున్నాను. మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నాను. త్వరలోనే దీని నుంచి కోలుకుని తిరిగి వస్తా. షూటింగ్స్‌లో పాల్గొంటాను. అని రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
రేణు దేశాయ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అభిమానులు షాక్‌కు గురి అవుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.