పెళ్లి చేసుకుని మోసం చేశాడు.. ఎస్సై పై సినీ న‌టి ఫిర్యాదు..!

Actress Radha complaint against her second husband. ఓ ఎస్సై మోసం చేశాడ‌ని ఆరోపిస్తూ విరుగంబాక్కం పోలీస్ స్టేష‌న్‌లో కోలీవుడ్ వ‌ర్థ‌మాన సినీ న‌టి రాధ(38) ఫిర్యాదు చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2021 3:42 AM GMT
Actress radha complaint against husband

త‌న‌ను ఓ ఎస్సై మోసం చేశాడ‌ని ఆరోపిస్తూ విరుగంబాక్కం పోలీస్ స్టేష‌న్‌లో కోలీవుడ్ వ‌ర్థ‌మాన సినీ న‌టి రాధ(38) ఫిర్యాదు చేశారు. 'సుందరం ట్రావెల్స్' చిత్రంలో హీరోయిన్ గా రాధ ప‌రిచ‌య‌మైంది. భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం రాధ.. త‌న కుమారుడితో క‌లిసి లోక‌య్య వీధిలో నివాసం ఉంటుంది. ఓ షూటింగ్ సంద‌ర్భంలో తిరువాన్మియూరు ఎస్‌ఐ వసంత్‌ రాజ్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అత‌డికి అప్ప‌టికే పెళ్లై భార్య, పిల్ల‌లు ఉన్నారు. అత‌డు రాధ కోస‌మే అధిక స‌మ‌యాన్ని కేటాయించ‌డంతో వీరిద్ద‌రు స‌న్నిహితులు అయ్యారు.

వీరిద్ద‌రి వ్య‌వ‌హారాన్ని ప‌సిగట్టిన ఎస్సై భార్య.. వ‌సంత్ రాజ్‌పై గ‌తంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ కేసు సంగతి ఏమైందో కానీ, వసంత్ రాజ్ ఆపై రాధకు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకుని వడపళని పీఎస్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఆ సమయంలోనే రాధను రహస్యంగా వివాహం చేసుకున్నాడ‌ని స‌మాచారం. అయితే.. ఇటీవ‌ల రాధ.. వ‌సంత్ రాజ్‌కు తెలియ‌కుండా త‌న ఆధార్ కార్డులో భ‌ర్త పేరు స్థానంలో వ‌సంత్ రాజ్ పేరును చూపించింది. అలాగే త‌న కుమారుడికి తండ్రిగానూ చూపించింది. ఇది వ‌సంత్ రాజ్‌కు ఆగ్ర‌హాం తెప్పించింది. ఆమెకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఎన్నూరుకు పోస్టింగ్ మార్చుకున్నాడు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల పోలీసు స్టేష‌న్ వ‌ద్దే వీరిద్ద‌రు గొడ‌వ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వసంత్ ఆమెను బెదరింపులకు గురిచేశాడు. దీంతో రాధ విరుగం బాక్కం పోలీసులను ఆశ్ర‌యించింది.


Next Story