హోట‌ల్‌లో నటి ప్రియా ప్రకాష్ వారియర్‌కు చేదు అనుభ‌వం

Actress Priya Prakash Varrier called out hotel making her sit outside premises eat.వ‌ర్థ‌మాన న‌టి ప్రియా ప్రకాష్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2022 7:49 AM GMT
హోట‌ల్‌లో నటి ప్రియా ప్రకాష్ వారియర్‌కు చేదు అనుభ‌వం

వ‌ర్థ‌మాన న‌టి ప్రియా ప్రకాష్ వారియ‌ర్ గురించి ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. కన్ను క‌ట్టే ఒక్క వీడియోతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యింది. తెలుగుతో పాటు ప‌లు బాష‌ల్లోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే.. త‌న‌కు ఓ హోట‌ల్‌లో ఎదురైన చేదు అనుభ‌వం గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రియా వెల్ల‌డించింది. తాను తెచ్చుకున్న పుడ్‌ను హోట‌ల్ వాళ్లు లోనికి అనుమ‌తించ‌క‌పోవ‌డంతో హోట‌ల్ బ‌య‌ట చ‌లిలో కూర్చొని భోజ‌నం చేసిన‌ట్లు చెప్పింది.

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు.. 'ది ఫెర్న్ గోరేగావ్ ' అనే హోట‌ల్‌లో ప్రియా బ‌స చేస్తోంది. అయితే.. ఆ హోట‌ల్‌లో బ‌య‌టి నుంచి పుడ్ తెచ్చుకోవ‌డానికి వీలు లేదు. కాగా.. ఆ విష‌యం తెలియ‌ని ప్రియా బ‌య‌ట నుంచి పుడ్ తెచ్చుకుని హోట‌ల్‌లోకి ప్ర‌వేశించే స‌మ‌యంలో హోట‌ల్ సిబ్బంది ఆమెను ఆపారు. ఈ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని.. ఈ సారికి అనుమ‌తించాల‌ని ప్రియా వారిని చాలా మ‌ర్యాదగా వేడుకున్న‌ట్లు చెప్పుకొచ్చింది.

ఇక్క‌డ తెలుసుకోవాల్సిన విష‌యం ఏంటంటే.. హోట‌ల్ బుకింగ్‌, రిజిస్ట్రేష‌న్ అన్నీ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ వాళ్లే చేస్తారు. ఆర్టిస్టుల‌కు సంబంధం ఉండ‌దని తెలిపింది. అయితే.. వారు తాను చెప్పే మాట‌ల‌ను క‌నీసం వినిపించుకోలేద‌ని ప్రియా వాపోయింది. దానిని ప‌డేయాల్సిందేన‌ని వారు ప‌ట్టారు. డ‌బ్బులు పెట్టిన కొన్న పుడ్ ను ప‌డేయ‌డం నాకు న‌చ్చ‌దు. ఎంత‌సేపు వారిని రిక్వెస్ట్ చేసినా ఫ‌లితం లేక‌పోయింది. అంతేకాకుండా వారు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించారు. దీంతో చేసేది లేక అంతచ‌లిలో హోట‌ల్ బ‌య‌ట కూర్చొనే భోజ‌నం చేయాల్సి వ‌చ్చింద‌ని ఆమె త‌న స్టోరీలో చెప్పుకొచ్చింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.


Next Story
Share it