బిగ్‌బాగ్ తెలుగు సీజ‌న్ 5.. ఈ వారం ప్రియా ఎలిమినేట్ కానుందా..?

Actress Priya Eliminated From Bigg Boss Telugu 5.బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్‌-5 ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Oct 2021 6:47 AM GMT
బిగ్‌బాగ్ తెలుగు సీజ‌న్ 5.. ఈ వారం ప్రియా ఎలిమినేట్ కానుందా..?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్‌-5 ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఈ రోజు ఏడో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు మ‌హిళా కంటెస్టెంట్‌ ఎలిమినేట్ కాగా.. నేడు కూడా మ‌రో మ‌హిళా కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేష‌న్‌లో అనీ మాస్టర్, లోబో, ప్రియ, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో శ్రీరామచంద్ర, ఆర్జే కాజల్ సేఫ్ అయ్యారు అని శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మిగిలిన ఆరుగురిలో అనీ మాస్టర్, లోబో, ప్రియా డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కాగా.. వీరిలో ప్రియా ఎలిమినేట్ కానుంద‌ని అంటున్నారు. బంగారు కోడిపెట్ట కెప్టెన్సీ టాస్కులో సన్నీ, ప్రియ మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రియకు మైనస్‌గా మారిందని.. ఇదే ఓటింగ్‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింద‌ని అంటున్నారు. స‌న్నీ చెంప ప‌గ‌ల‌కొడ‌తాన‌ని ప్రియా వార్నింగ్ ఇవ్వ‌డం స‌రికాద‌ని ప‌లువురు అంటున్నారు. ఇక స‌న్ని కెప్టెన్ అయ్యేందుకు అనీ మాస్ట‌ర్ స‌హ‌క‌రించ‌డం.. అనీ మాస్ట‌ర్‌కి క‌లిసోచ్చింద‌ని అంటున్నారు. మ‌రీ నిజంగానే ప్రియా ఎలిమినేట్ అయ్యిందో లేక వేరే ఎవ‌రైనా ఎలిమినేట్ అయ్యారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ ప్ర‌సారం అయ్యేంత వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు.

Next Story
Share it