పెళ్లిచేసుకున్న బాపుబొమ్మ
Actress Pranitha Subhash gets married.టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రణిత సుభాష్. ఏం పిల్లో..
By తోట వంశీ కుమార్ Published on 31 May 2021 3:36 PM ISTటాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రణిత సుభాష్. 'ఏం పిల్లో.. ఏం పిల్లడో' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. ఆ తర్వాత 'బావ', 'అత్తారింటికి దారేది', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'రభస' వంటి చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాపుబొమ్మగా అందరి మదిలో చెదరని ముద్ర వేసిన ఈ అమ్మడు ఆదివారం నితిన్ రాజ్ అనే బిజినెస్ మెన్ ని వివాహం చేసుకుంది. కరోనా కారణంగా బెంగళూరులోని ఆమె నివాసంలో అతి కొద్ది మంది సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. చాలా రోజులుగా నితిన్ రాజ్ తో ప్రేమలో ఉన్న ప్రణీత.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
'ఇది లవ్ కమ్ అరెంజెడ్ మ్యారెజ్. చాలా కాలంగా నితిన్ నాకు తెలుసు. ఇక పెళ్లితో మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాక మా ఇరు కుటుంబాలకు విషయం చెప్పాం. వాళ్లు కూడా మా నిర్ణయం పట్ల చాలా సంతోషించారు. ఇక నా వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం నాకు అంతగా ఇష్టం ఉండదు. నేను నా పెళ్లి ఎలా అయితే జరగాలని కలలు కన్నానో అలానే జరిగింది. కరోనా కారణంగా అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు అని' ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది అమ్మడు. ప్రస్తుతం ప్రణిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.