టాలీవుడ్‌లో హీరోయిన్లతో సమానంగా ఫేమ్ సంపాదించిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి ఒకరు. సినిమాల ద్వారా ఎంత పేరు సంపాదించుకుందో.. సోషల్ మీడియా ద్వారా అంతకంటే ఎక్కువగానే పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఐదుపదులకు చేరువైనా కూడా ఆమె ఎనర్జీ, వేగం, అందం ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియోనే అందుకు నిదర్శనం.
ఓ సెట్స్ లో సహనటులతో వీర మాస్ డ్యాన్స్ చేసింది. తీన్మార్ మ్యూజిక్ కు అనుగుణంగా చీరకట్టులో ప్రగతి వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయిపోయారు. 'ఇలాంటి అవకాశాలు మళ్లీ, మళ్లీ రావు. వచ్చినప్పుడు అస్సలు మిస్ కావొద్దు. మీ పిచ్చిని బయటపెట్టాలి థ్యాంక్స్ మై బాయ్స్' అంటూ ఈ వీడియోని ప్రగతి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి ఒక్కరోజులోనే 21,381 లైక్స్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి వీడియో చూసేయండి.