బాలీవుడ్ నటులు బాలకృష్ణను చూసి నేర్చుకోవాలి: నటి పాయల్ ఘోష్
తాజాగా పాయల్ ఘోష్ ఎక్స్ (ట్విట్టర్)లో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది.
By Srikanth Gundamalla
బాలీవుడ్ నటులు బాలకృష్ణను చూసి నేర్చుకోవాలి: నటి పాయల్ ఘోష్
నటి పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో ఎక్కువ నెటిజన్లతో టచ్‌లో ఉంటూనే ఉంటుంది. తరచూ ఓ వివాదాన్ని నెత్తిన వేసుకుంటుంది. ఆమె ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. తరచూ ఆయన గురించి గొప్పగా చెబుతుంది. బాలీవుడ్ స్టార్స్‌ను విమర్శిస్తుంది. ఈ విధంగా ఎప్పుడూ నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటుంది నటి పాయల్ ఘోష్. అయితే.. ఎన్టీఆర్‌తో కలిసి ఊసరవెల్లి సినిమాలో నటించింది. తమన్నాకు ఫ్రెండ్‌గా ఈ మూవీలో నటించింది పాయల్ ఘోష్. మనోజ్ ప్రయాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఊసరవెల్లి సినిమాతోనే ఈమెకు తెలుగులో కాస్త గుర్తింపు వచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పనిచేసిన తర్వాత ఆయనకు ఫ్యాన్ అయిపోయింది పాయల్ ఘోష్. ప్రపంచస్థాయి నటుడు అవుతాడని ఆర్ఆర్ఆర్ కంటే ఆమె ముందుగానే చెప్పింది. నాలుగేళ్ల క్రితమే ఓ ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చింది. అయితే.. ఈమె అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడం కూడా జరిగిపోయింది. దాంతో.. అప్పుడెప్పుడో చేసిన ట్వీట్‌ను మరోసారి రీ ట్వీట్ చేస్తూ తాను ముందే చెప్పానని కూడా తెలిపింది పాయల్ ఘోష్. తాజాగా టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఇది వైరల్ అవుతోంది.
పాయల్ ఘోష్ క్యాస్టింగ్ కౌచ్‌పై గతంలో కామెంట్స్ చేసింది. ఎప్పుడూ బాలీవుడ్‌పై కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. తాజాగా పాయల్ ఘోష్ ఎక్స్ (ట్విట్టర్)లో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే మరోసారి బాలీవుడ్ నటుల గురించి కీలక కామెంట్స్ చేసింది. బాలకృష్ణ ఈ వయసులోనూ ఎంతో కష్టపడి హిట్లు ఇస్తున్నారని చెప్పారు. ఆయన్ని చూసి బాలీవుడ్ ఎంతో నేర్చుకోవాలని రాసుకొచ్చారు. దాంతో.. మరోసారి పాయల్ ఘోష్ బాలీవుడ్ పరువు తీసినట్లు అయ్యింది. కొందరు బాలీవుడ్ అభిమానులు ఆమెను విమర్శిస్తున్నారు. ఇంకొందరు మాత్రం దట్ ఈజ్ బాలకృష్ణ అంటున్నారు.
Bala krishna Sir even in this age giving super hits… Bollywood actors should learn from them 💕 pic.twitter.com/OyjDLFJ1yo
— Payal Ghoshॐ (@iampayalghosh) November 4, 2023