కవలలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత
Actress Namitha gave birth to twins.నటి నమిత పండంటి కవలలకు జన్మ నిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్
By తోట వంశీ కుమార్ Published on 20 Aug 2022 10:05 AM ISTనటి నమిత పండంటి కవలలకు జన్మ నిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. చెన్నై సమీపంలోని క్రోమ్‌పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ఆస్పత్రి యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.
"కృష్ణాష్టమి రోజున మీతో ఓ సంతోషకరమైన విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా. నాకు ఇద్దరు కవలలు జన్మించారు. మీ ఆశీర్వాదాలు, ప్రేమ ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాము. ఆస్పత్రి సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నన్ను గైడ్ చేసినందుకు, నా పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను". అంటూ కవలలను ఎత్తుకుని భర్తతో ఉన్న వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నారు.
వెంకటేశ్ హీరోగా నటించిన 'జెమిని' చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నమిత. 'సొంతం', 'సింహ' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అదే సమయంలో తమిళంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. 2017లో ప్రియుడు వీరేంద్రచౌదరిని పెళ్లి చేసుకుంది. ఇక నమ్మితకు కవలలు జన్మించారని తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నెటీజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.