బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5.. లహరి ఔట్‌..?

Actress Lahari may be eliminated from Bigg Boss Telugu 5.బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5లో తొలి వారం స‌ర‌యు ఎలిమినేట్ కాగా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sept 2021 10:04 AM IST
బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5.. లహరి ఔట్‌..?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5లో తొలి వారం స‌ర‌యు ఎలిమినేట్ కాగా.. రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. ఇక మూడో వారం ఎవ‌రు హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు అనే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. మూడో వారం నామినేష‌న్‌లో శ్రీరామచంద్ర, మానస్‌, ప్రియ, ప్రియాంక, లహరి ఉన్నారు. శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో శ్రీరామచంద్ర, ప్రియాంక సేఫ్ అని నాగార్జున ప్ర‌క‌టించారు. ఇక ప్ర‌స్తుతం ప్రియ‌, మాన‌స్‌, ల‌హ‌రి డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు.

ఇక ఈ ముగ్గురిలో ల‌హ‌రి ఎలిమినేట్ కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నిజానికి నామినేష‌న్ స‌మయంలో ప్రియ చేసిన కామెంట్‌తో హౌస్‌తో పాటు బ‌య‌ట కూడా ఆమెపై నెగిటివిటీ ఎక్కువైంది. ఇదే స‌మయంలో ఇంట్లో సింగిల్‌మెన్‌ (పెళ్లికానివాళ్లు) ఉన్నప్పటికీ ఆమె నా వెంట పడుతుంది అంటూ ప్రియతో లహరి గురించి ర‌వి మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో.. ప్రియపై ఉన్న నెగిటివిటీ మొత్తం పోయింది.

ఈ ముగ్గ‌రిలో మాన‌స్‌కు ఎక్కువ ఓట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ప్రియా, ల‌హారిలు ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ కానున్నార‌ని అంటున్నారు. కాగా.. అంద‌రి కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన ల‌హ‌రీనే ఎలిమినేట్ కానుంద‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. మ‌రీ నిజంగా ల‌హ‌రీ ఎలిమినేట్ కానుందా లేదా అనేది నేటి ఎపిసోడ్‌తో తేలిపోనుంది. ల‌హారి కాకుండా ప్రియ‌ను కూడా ఎలిమినేట్ చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.

Next Story