సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం
Actress Kavitha son dies of covid 19.సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడాలేకుండా అందరూ కరోనా
By తోట వంశీ కుమార్
సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడాలేకుండా అందరూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీని కరోనా భూతం పట్టి విడవడం లేదు. ప్రముఖ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో పోరాడుతూ జూన్ 15న కన్నుమూశారు. మరో వైపు ఆమె భర్త సైతం కరోనాతో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కవిత కుమారుడు సంజయ్ రూప్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయితే ఆరోగ్యం ఏ మాత్రం కుదుటపడకపోవడంతో ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత.. తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు. 11 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అన్ని బాషల్లో దాదాపు 300పైగా చిత్రాల్లో నటించారు.
కరోనా సెకండ్ వేవ్ దక్షిణాది చిత్ర రంగంలో ఎంతో మందిని బలితీసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో ప్రముఖ సినీ జర్నలిస్ట్, యూట్యూబ్ ఇంటర్య్వూయర్ తుమ్మల నర్సింహారెడ్డి(టీఎన్ఆర్) కరోనాతో కన్నుమూశారు. మరో సీనియర్ నటుడు గౌతం రాజు సోదరుడు సిద్దార్థ కూడా కరోనాతో గత నెలలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.