నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం
Actress Jayaprada Mother Passed away.సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జయప్రద తల్లి
By తోట వంశీ కుమార్ Published on 2 Feb 2022 7:49 AM ISTసీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జయప్రద తల్లి నీలవేణి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం సాయంత్రం ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. ప్రస్తుతం జయప్రద ఢిల్లీలో ఉండగా.. సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. నీలవేణి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. జయప్రద కెరీర్ విజయం సాధించడంలో నీలవేణి పాత్ర ఎంతగానో ఉండేది. ఈ విషయాన్ని జయప్రద పలు ఇంటర్య్వూలో చెప్పారు.
ఇక జయప్రద విషయానికి వస్తే.. మూడు దశాబ్దాల సీని కెరీర్‌లో వెండితెరపై తిరుగులేని నటిగా వెలుగొందారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి ఇలా దాదాపు అందరూ అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషల్లో దాదాపు మూడు వందలకు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. 'భూమికోసం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జయప్రద.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశారు. అనంతరం రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత.. సినిమాల్లో నటించడం చాలా తగ్గించారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ (బీజేపీ)లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు.