క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి హంసానందిని
Actress Hamsa Nandini Diagnosed with cancer.తెలుగు ప్రేక్షకులకు నటి హంసా నందిని సుపరిచితురాలే. 'మిర్చి'
By తోట వంశీ కుమార్ Published on 20 Dec 2021 11:11 AM ISTతెలుగు ప్రేక్షకులకు నటి హంసా నందిని సుపరిచితురాలే. 'మిర్చి' 'అత్తారింటికి దారేది' వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో యువత హృదయాలను కొల్లగొట్టింది. సోషల్ మీడియా వేదికగా ఎల్లప్పుడూ అభిమానులకు చేరువగా ఉండేది. అయితే.. ఆమె గత కొంతకాలంగా సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీంతో హంసాకు ఏమైందని.. ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిల వర్షం కురిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అసలు విషయాన్ని వెల్లడించింది హంసా నందిని. ఆమె ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పింది.
18 సంవత్సరాల క్రితం తన తల్లి క్యాన్సర్‌తో మరణించారని.. అప్పటి నుంచి తాను అదే భయంతో జీవిస్తున్నట్లు హంసా నందిని తెలిపింది. ఇక నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపిస్తే.. డాక్టర్లను సంప్రదించగా.. పరీక్షల అనంతరం తనకు రొమ్ము క్యాన్సర్ గ్రేడ్-3 దశలో ఉన్నట్లు నిర్థరాణ అయినట్లు చెప్పింది. శస్త్రచికిత్స చేసి ఆ కణతిని తొలగించారు. క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించడంతో పెనుప్రమాదం తప్పిందని బావించాను. అయితే.. ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు.
జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు ఇటీవల డాక్టర్లు తెలిపారు. ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే సర్జరీలు చేయించుకోవడం ఒక్కటే మాత్రం. ప్రస్తుతానికి 9 విడుదల కిమోథెరపీలు చేయించుకున్నాను. మరో ఏడు చేయించుకోవాల్సి ఉంది. ఈ మహమ్మారికి నా జీవితం అంకితం చేయాలనుకోవడం లేదు. నవ్వుతూ ధైర్యంగా పోరాడాలనుకుంటున్నా. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా. అందరిలో ప్రేరణనింపడానికే ఇది చెబుతున్నా అని హంసా నందిని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ విషయం తెలిసిన నెటీజన్లు.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.