మాజీ మంత్రికి న‌టి చాందిని షాక్‌.. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరిన నటి

Actress Chandini petition on AIADMK EX-Minister Manikandan.అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు త‌మిళ

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 24 July 2021 9:03 AM IST

మాజీ మంత్రికి న‌టి చాందిని షాక్‌.. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరిన నటి

అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్‌కు త‌మిళ నటి చాందిని షాక్‌ ఇచ్చారు. త‌న‌కు న‌ష్ట‌ప‌రిహారంగా మ‌ణికంఠ‌న్ రూ.10కోట్లు చెల్లించాలంటూ స్థానిక సైదాపేట కోర్టులో చాందిని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. మణికంఠన్‌ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సహజీవనం చేసి మోసం చేశారని నటి చాందిని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో పోలీసులు ఆయనను అరెస్టు కూడా చేశారు.

ప్రస్తుతం ఈ కేసు చెన్నై హైకోర్టు విచారణలో ఉండగా.. చాందిని గురువారం స్థానిక సైదాపేట కోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. మాజీమంత్రి మణికంఠన్‌ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అంతేకాదు తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో.. అందుకుగాను తనకు అయ్యే నెలవారి ఖర్చులు కూడా ఆయనే చెల్లించాలని తాజా పిటిషన్‌లో కోరారు. ఇక ఈ పిటిషన్‌ వచ్చే నెల 5న కోర్టు విచారణకు రానుంది.

Next Story