బిందు మాధ‌వి డ్రెస్సింగ్‌పై ట్రోల్‌.. తనదైన స్టైల్లో నెటిజన్‌ నోరుమూయించిన ఆడ‌పులి

Actress Bindu Madhavi gives strong counter to netizen.సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని త‌మ అభిమానుల‌కు మ‌రింత చేరువ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Aug 2022 10:03 AM IST
బిందు మాధ‌వి డ్రెస్సింగ్‌పై ట్రోల్‌.. తనదైన స్టైల్లో నెటిజన్‌ నోరుమూయించిన ఆడ‌పులి

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని త‌మ అభిమానుల‌కు మ‌రింత చేరువ అవుతున్నారు న‌టీన‌టులు. అభిమానుల కోసం అప్పుడ‌ప్పుడూ వారు అడిగే ప్ర‌శ్న‌ల‌ను స‌మాధానాలు ఇస్తూ ఉత్సాహ‌ప‌రుస్తుంటారు. అయితే కొన్ని సార్లు నెటీజ‌న్లు అడిగే ప్ర‌శ్న‌లు స‌ద‌రు న‌టీన‌టుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. కొంద‌రు వాటికి తెలివిగా స‌మాధానం చేస్తూ త‌ప్పించుకుంటుంటే మ‌రికొంద‌రు అడ్డంగా బుక్కైన సంద‌ర్భాలు ఉన్నాయి. తాజాగా హీరోయిన్‌, బిగ్‌బాష్ ఓటీటీ విన్నర్ బింధుమాధ‌వి త‌న‌పై ఓ నెటిజ‌న్ చేసిన నెగిటివ్ కామెంట్ కు దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చింది.

'అవకాయా బిర్యానీ', 'బంపర్‌ ఆఫర్‌' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది బిందు మాధ‌వి. ఇక బిగ్‌బాస్ లో ఉన్న‌ప్పుడు త‌న తనదైన ఆట, యాటిటూడ్‌, మాటలతో గట్టి పోటి ఇస్తూ విజేత‌గా నిలిచింది. అంతేకాదు సాంప్ర‌దుస్తుల‌ను ధ‌రించి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. కాగా.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో కాస్తా ట్రెండి డ్రెస్‌లో కనిపించింది. దీనిపై ఓ నెటీజ‌న్ అభ్యంతరం వ్యక్తం చేసింది." బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అందరూ శరీరం క‌నిపించేలా దుస్తులు వేసుకుంటే బిందు మాత్రం మాత్రం కేవలం సంప్రదాయమైన అలంకరణకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బిందు మాధవి అంటే గౌర‌వం పెరిగింది. కానీ ఇప్పుడు అది పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే తను హౌజ్‌లో అలా ఉంది"అంటూ విమ‌ర్శించింది.

దీనిపై బిందూ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. "ఓ వ్య‌క్తికి ఇచ్చే గౌర‌వం దుస్తుల కార‌ణాంగానే వ‌స్తుంది అంటే అలాంటి గౌర‌వం త‌న‌కు వ‌ద్దంటూ రిప్లై ఇచ్చింది". బిందు మాధ‌వి స‌మాధానం ప‌ట్ల నెటీజ‌న్లు ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. వీరి సంబాష‌ణ‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్ నెటింట ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Next Story