బెంగాలీ నటి బిదిషా డి మజుందార్ ఆత్మ‌హ‌త్య‌.. 10 రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు

Actress Bidisha De Majumdar found hanging in Kolkata apartment.సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాము

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2022 8:56 AM GMT
బెంగాలీ నటి బిదిషా డి మజుందార్ ఆత్మ‌హ‌త్య‌.. 10 రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు

సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాము కోరుకున్న రంగుల ప్ర‌పంచంలో రాణించ‌లేక కొంద‌రు, ఒత్తిడి త‌ట్టుకోలేక ఇంకొంద‌రు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలకు పాల్ప‌డుతున్నారు. స‌మ‌స్య ఏదైన‌ప్ప‌టికీ చావు ఒక్క‌టే ప‌రిష్కారం కాదు. ఇక బెంగాల్ ఇండ‌స్ట్రీలో ఒకే నెల‌లో ఇద్ద‌రు న‌టీమ‌ణులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. స‌రిగ్గా ప‌దిరోజుల కింద‌ట నటి పల్లవి డే తన ప్లాట్ లో చనిపోయిన విషయం మ‌రువ‌క ముందే మరో నటి కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌డం షాక్‌కు గురిచేస్తోంది. తాజాగా నటి బిదిషా డి మజుందార్(21) బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడింది.

మోడ‌ల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన బిదిషా డి మజుందార్ 2021లో 'భార్ ది క్లౌన్' అనే షార్ట్ ఫిల్మ్‌లో న‌టించి మంచి గుర్తింపు పొందింది. ఈ క్ర‌మంలో వ‌రుస అవకాశాలు ద‌క్కించుకుని ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌దైన ముద్ర‌ను వేసింది. కాగా.. ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తాలోని త‌న అపార్ట్‌మెంట్‌లో బుధ‌వారం ఉరి వేసుకున్న స్థితిలో క‌నిపించింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అక్క‌డ న‌టి రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్‌జి కర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే.. న‌టి మృతిపై త‌ల్లిదండ్రులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. బిదిషా డి మజుందార్‌కు అనుభాబ్ బేరా అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్న‌ట్లు న‌టి స్నేహితులు చెబుతున్నారు. అత‌డి కార‌ణంగా కొన్ని రోజులుగా ఆమె డిప్రెషెన్‌లోకి వెళ్లిన‌ట్లు వారు చెప్పారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it