నిద్ర‌మాత్ర‌లు మింగి న‌టి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. క్లారిటీ ఇదే

Actress Bhama Denies Suicide Attempt.ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి భామ నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2022 9:02 AM IST
నిద్ర‌మాత్ర‌లు మింగి న‌టి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. క్లారిటీ ఇదే

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి భామ నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. 2017లోని వేదింపుల కేసును తిరిగి విచారిస్తుండ‌డంతో భ‌యాందోళ‌న‌కు లోనైన న‌టి నిద్ర‌మాత్రలు మింగి ఆత్మ‌హ‌త్యాయత్నానికి పాల్ప‌డిందనేది ఆ వార్త‌ల సారాంశం. కాగా.. త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై న‌టి భామ స్పందించింది. ఆ వార్త‌లు అన్ని అస‌త్యాల‌ని కొట్టి పారేసింది.

గ‌త కొద్ది రోజులుగా నా పేరు మీద కొన్ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. ఎవ్వ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు. ప్ర‌స్తుతం నేను, నా కుటుంబం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాం. మీ ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు. ద‌య‌చేసి ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌కండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

లాహిత‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'నైవేద్యం' చిత్రంతో భామ సినీప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. అనంత‌రం ప‌లు చిత్రాల్లో న‌టించి మెప్పించింది. 2020 జ‌న‌వ‌రిలో వ్యాపార‌వేత్త అరుణ్‌ను వివాహం చేసుకుంది. అనంత‌రం సినిమాకు బ్రేక్ ఇచ్చింది. మ‌రుస‌టి ఏడాదే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇటీవ‌లే కుమార్తై పుట్టిన రోజు వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

Next Story