నటికి కరోనా.. ఆస్పత్రిలో చేరనని మొండికేసింది
Actress Banita sandhu tests positive for covid 19.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దీనికి తోడు నటికి కరోనా.. ఆస్పత్రిలో చేరనని మొండికేసింది.
By తోట వంశీ కుమార్ Published on 6 Jan 2021 12:23 PM ISTదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దీనికి తోడు స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. విదేశాల నుంచి వచ్చే వారికి టెస్ట్‌లు చేయడంతో పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అలాగే పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. షూటింగ్ కోసం ఓ నటి విదేశాల నుంచి భారత్‌కు వచ్చింది. కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా.. అందుకు ఆమె నిరాకరించింది. అంతేకాక అక్కడ నుంచి పరారయ్యేందుకు సైతం యత్నించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమె పారిపోకుండా అంబులెన్స్‌ను చుట్టుముట్టి రక్షణకల్పించారు.
వివరాల్లోకి వెళ్తే.. తెరెసా చిత్రంలో నటించేందుకు హీరోయిన్ బనితా సంధు డిసెంబర్ 20న లండన్ నుంచి కోల్‌కతాకు వచ్చారు. అయితే.. ఆమె ప్రయాణించిన విమానంలో ప్రయాణికుడికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్లు గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ విమానంలో ప్రయాణించిన అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నటి బనితా సంధుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. కరోనా నా లేక కొత్తస్ట్రెయిన్ నా అన్నది లేలాల్సి ఉంది.
పాజిటివ్ అని తేలిన వారిని బెలియాఘట ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. బబితాను కూడా అక్కడికే పంపించారు. కానీ ఆమె ఆ ఆస్పత్రికి వెళ్లనని మొండికేస్తూ అంబులెన్స్ దిగడానికి నిరాకరించింది. ఓవైపు సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంటే ఆమె అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అంబులెన్స్ చుట్టూ కవచంలా నిలబడి ఆమె పారిపోకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.