భ‌ర్త‌ చెంప చెల్లుమ‌నిపించిన‌ హీరోయిన్‌.. భార్య‌లు ఇలా చేయాలంటూ చెబుతోంది

Actress Anita hassanandani slapped her husband.హీరోయిన్ ప్ర‌స్తుతం బుల్లితెర న‌టి అయిన అనిత త‌న భ‌ర్త రోహిత్ రెడ్డి చెంప చెల్లుమ‌నిపించింది. స‌ర‌దాగా అని చెబుతూనే గ‌ట్టిగా కొట్టేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 May 2021 12:25 PM IST
Anitha Hassanandani

ఒక‌ప్ప‌టి హీరోయిన్ ప్ర‌స్తుతం బుల్లితెర న‌టి అయిన అనిత త‌న భ‌ర్త రోహిత్ రెడ్డి చెంప చెల్లుమ‌నిపించింది. స‌ర‌దాగా అని చెబుతూనే గ‌ట్టిగా కొట్టేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అనిత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. భార్య‌ల‌కు ఈ ట్రిక్ న‌చ్చుతుంద‌ని చెబుతూ.. మీరు కూడా ఇంట్లో ప్ర‌య‌త్నించాల‌ని చెబుతూ.. త‌న భ‌ర్త చెంప చెల్లుమ‌నిపించింది. పాపం ఆమె భ‌ర్త రోహిత్ రెడ్డి.. ఆమెను ఏమీ అన‌లేక అక్క‌డ నుంచి వెళ్లిపోయాడు.

వీడియోలో ఏం ఉందంటే.. అనిత తన భర్తను కుర్చీలో కూర్చోబెట్టింది. అతడి వెనకాల నిలబడిన ఆమె తన చేతిలో ఓ దారాన్ని పట్టుకున్నట్లు నటించింది. దాన్ని అతడి చెవిలో నుంచి తీసినట్లు యాక్ట్‌ చేసింది. ఇంతలో ఫడేలుమని చెంప మీద ఒక్కటిచ్చింది. దీంతో షాకైన భర్త తనను ఏమీ అనలేక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. భార్యలకు ఈ మ్యాజిక్‌ ట్రిక్‌ తప్పకుండా నచ్చుతుందన్న అనిత 'ఈ ట్రిక్‌ను తప్పకుండా ఇంట్లో ప్రయత్నించండి' అని వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చింది. ఇక భార్య చేసిన ప‌నికి ఊరుకునేది లేద‌ని.. త్వ‌ర‌లోనే ప్ర‌తీకారం తీర్చుకుంటాన‌ని అంటున్నాడు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. పాపం.. రోహిత్ ముఖం మాడిపోయింద‌ని కొంద‌రు కామెంట్లు చేయ‌గా.. ఎలా రివేంజ్ తీసుకుంటాడోన‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. 'నువ్వు నేను', 'శ్రీరామ్‌' వంటి చిత్రాల్లో నటించిన అనిత 2013లో రోహిత్‌ను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.




Next Story