యంగ్ హీరోయిన్‌కు షాక్.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్
Actress Amritha Aiyer Instagram Account Hacked.ఇటీవల కాలంలో నటీ నటుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాకర్లు
By తోట వంశీ కుమార్ Published on
2 Feb 2022 8:15 AM GMT

ఇటీవల కాలంలో నటీ నటుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాకర్లు తరుచూ హ్యాకింగ్ చేస్తున్నారు. వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్న హ్యాకర్లు.. వాటిల్లో అసభ్యమైన పోస్టులు పెడుతున్నారు. తాజాగా యువ నటి అమృతా అయ్యర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని అమృతా అయ్యర్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. త్వరలోనే తన అకౌంట్ పునరుద్దరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. కాగా.. ఇప్పటి వరకు ఆమె అకౌంట్ నుంచి ఎటువంటి అవాంఛనీయ పోస్టులు పెట్టలేదని తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'బిగిల్' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అమృతా అయ్యర్ తెలుగులో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో రెడ్ సినిమాలో నటించింది. అయితే.. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక యంగ్ హీరో శ్రీ విష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలోనూ అమృతా నటించింది. గతేడాది డిసెంబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అమృత నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Next Story