చిత్రపరిశ్రమలో మరో విషాదం.. బాలీవుడ్ నటుడు యూసుఫ్ హుస్సేన్ కన్నుమూత
Actor Yusuf Hussain Dies Of COVID At 73.చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాత్
By తోట వంశీ కుమార్ Published on
30 Oct 2021 5:52 AM GMT

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించిన విషయాన్ని జీర్ణించుకోకముందే నేడు మరో నటుడు కన్నుమూశారు. బాలీవుడ్ నటుడు యూసుఫ్ హుస్సేన్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. 'ధూమ్ 2', 'రాయిస్' వంటి చిత్రాలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఈ విషయాన్ని సినీ నిర్మాత హన్సనల్ మెహతా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. యూసుఫ్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు.
హన్సనల్ మెహతా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆయన నాకు మామ కాదు తండ్రి లాంటి వాడని ఎమోషనల్ అయ్యారు. రాజ్‌కుమార్ రావుతో తీసిన షాహిద్ చిత్ర నిర్మాణ సమయంలో యూసుఫ్ తనకు అండగా నిలిచినట్లు తెలిపాడు. ఆయనతో నటించిన అభిషేక్ బచ్చన్, మనోజ్ బాజ్‌పాయ్, నటి పూజా భట్ సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Next Story