కమెడియన్ వివేక్ కు గుండె పోటు.. పరిస్థితి క్రిటికల్

Actor Vivek hospitalised.ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ తీవ్ర అనారోగ్యంతో ఆసపత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 16 April 2021 1:57 PM IST

Actor Vivek

ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ తీవ్ర అనారోగ్యంతో ఆసపత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 58 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. చెన్నై ఓమందూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్‌ గురువారం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ట్వీట్‌ చేశారు. ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ వ్యాక్సిన్ ను తీసుకోవాలని కోరారు.

వికీ డోనార్ తమిళ రీమేక్ అయిన ధారాల ప్రభు సినిమాలో వివేక్ ఇటీవల నటించారు. కమల్ హాసన్ ఇండియన్-2 సినిమాలో కూడా వివేక్ నటించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తూ ఉన్నారు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రజలకు కూడా పరిచయమే..!


Next Story