గుత్తా జ్వాల భ‌ర్త హీరో విష్ణు విశాల్‌కు క‌రోనా పాజిటివ్‌

Actor Vishnu Vishal test positive for Covid 19.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. సామాన్యులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2022 8:58 AM GMT
గుత్తా జ్వాల భ‌ర్త హీరో విష్ణు విశాల్‌కు క‌రోనా పాజిటివ్‌

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అనే తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సినీ రంగానికి చెందిన న‌టులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మంచు ల‌క్ష్మీ, మంచు మ‌నోజ్‌, త‌మ‌న్‌, కోలీవుడ్‌కు చెందిన చియాన్ విక్ర‌మ్‌, అర్జున్‌, వ‌డిపోలు, వ‌రలక్ష్మీ శరత్ కుమార్, స‌త్య‌రాజ్‌ క‌రోనా వైర‌స్ బారిన ప‌డగా తాజాగా బాడ్మింటన్ ప్లేయ‌ర్ గుత్తా జ్వాల భ‌ర్త హీరో విష్ణు విశాల్ కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణగా అయింది.

ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. పాజిటివ్ రిజల్ట్ తో 2022 ప్రారంభించినట్లు చెప్పారు. 'అవును నాకు కొవిడ్ పాజిటివ్‌ రిజల్ట్ వచ్చింది. గత వారంలో నన్ను క‌లిసిన వారు అంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోండి. భయంకరమైన ఒళ్లు నొప్పులు, ముక్కు దిబ్బడ, గొంతు దురద, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయి. త్వరలో బౌన్స్ బ్యాక్ అవుతా' అంటూ విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. ఈ విష‌యం తెలిసిన ఆయ‌న అభిమానులు.. విష్ణు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it