కెప్టెన్ విజ‌య్‌కాంత్ కు అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

Actor Vijaykanth hospitalised.త‌మిళ సినీ న‌టుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజ‌య్‌కాంత్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2021 11:58 AM IST
Vijaykanth

త‌మిళ సినీ న‌టుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజ‌య్‌కాంత్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఆయ‌నకు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు త‌లెత్తాయి. దీంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను చెన్నైలోని ఓ ప్ర‌ముఖ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌త్యేక వైద్య‌బృందం ప్ర‌స్తుతం ఆయ‌న‌కు చికిత్స అందిస్తోంది. కాగా.. దీనిపై డీఎండీకే పార్టీ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

జ‌న‌ర‌ల్ చెక‌ప్ కోసం మాత్ర‌మే ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరార‌ని.. ప్ర‌స్తుతం ఆయ‌న‌ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌రో రెండు రోజుల్లో ఆయ‌న డిశ్చార్జ్ కానున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కాగా.. ఈ విష‌యం తెలిసిన ఆయ‌న అభిమానులు త్వ‌ర‌గా ఆయ‌న కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు. కాగా.. గత ఏడాది ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. క‌రోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని అప్పట్లో ఆయన తెలిపారు. ఆ తర్వాత చికిత్స తీసుకుని ఆయన సురక్షితంగా బయటపడ్డారు.




Next Story