ప్ర‌ముఖ న‌టుడు ఉత్తేజ్ ఇంట విషాదం

Actor Uttej Wife passed away.ప్ర‌ముఖ న‌టుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sept 2021 10:25 AM IST
ప్ర‌ముఖ న‌టుడు ఉత్తేజ్ ఇంట విషాదం

ప్ర‌ముఖ న‌టుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి క‌న్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్ర‌మంలో ప‌రిస్థితి విష‌మించి సోమ‌వారం ఉద‌యం ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. భార్య ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఉత్తేజ్ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. విష‌యం తెలిసిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆమె మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ప‌ద్మావ‌తి విధులు నిర్వర్తించేవారు.

ఉత్తేజ్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నాం మహ్రాపస్థానంలో పద్మ అంత్యక్రియలు జరగనున్నాయి. అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేరని ఉత్తేజ్‌ తనయ చేతన ఉత్తేజ్‌ అన్నారు.

ఉత్తేజ్‌ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసి.. ఆ తర్వాత నటుడిగా మారారు. మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, డేంజర్ వంటి సినిమాలకు మాటలు కూడా రాశారు. దాదాపు 200 చిత్రాల్లో నటించి నటుడిగా ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. అటు సినిమాల్లో నటిస్తూనే.. ఉత్తేజ్ పలు సేవా కార్యక్రమాలు కూడా చేసేవారు. అందులో ఆయన భార్య పద్మవతి కూడా పాలు పంచుకునేది.

Next Story